యేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగ తగిలిన లంకె బిందెలాగ
ఎంత సక్కగున్నావే.. లచ్చిమి,
ఎంత సక్కగున్నావే
సింతసెట్టు
ఎక్కి సిగురు కొయ్యబోతె..
చేతికి అందిన సందమామలాగ
ఎంత సక్కగున్నావే.. లచ్చిమి,
ఎంత సక్కగున్నావే
మల్లెపూల
మద్దె ముద్దబంతిలాగ ఎంత సక్కగున్నావే..
మత్తైదువ
మెళ్లో పసుకుకొమ్ములాగ ఎంత సక్కగున్నావే..
సుక్కల సీర కట్టుకున్న
వెన్నెలలాగ ఎంత సక్కగున్నావే..
యేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగ తగిలిన లంకె బిందెలాగ
ఎంత సక్కగున్నావే.. లచ్చిమి,
ఎంత సక్కగున్నావే
సింతసెట్టు
ఎక్కి సిగురు కొయ్యబోతె..
చేతికి అందిన సందమామలాగ
ఎంత సక్కగున్నావే.. లచ్చిమి,
ఎంత సక్కగున్నావే
చరణం
1:
రెండు కాళ్ల సినుకువి
నువ్వు..
గుండె సెర్లో దూకేసినావు..
అలల మూటలిప్పేసినావు..
ఎంత సక్కగున్నావే..
లచ్చిమి,
ఎంత సక్కగున్నావే!!
మబ్బులేని
మెరుపువి నువ్వూ..
నేలమీద నడిసేసి నావూ..
నన్ను నింగి చేసేసి నావూ..
ఎంత సక్కగున్నావే..
లచ్చిమి,
ఎంత సక్కగున్నావే!!
సెరుకుముక్క
నువ్వు కొరికి తింటావుంటే
ఎంత సక్కగున్నావే..
సెరుకు గెడకే తీపిరుసి
తెలిపినావే ఎంత సక్కగున్నావే..
తిరనాళ్లోలో
తప్పి ఏడ్సేసి బిడ్డకు
ఎదురొచ్చిన
తల్లి సిరునవ్వులాగా
ఎంత సక్కగున్నావే..
లచ్చిమి,
ఎంత సక్కగున్నావే!!
గాలి పల్లికిలో ఎంకి పాటలాగ
ఎంకి పాటలోన తెలుగు మాటలాగ
ఎంత సక్కగున్నావే..
లచ్చిమి,
ఎంత సక్కగున్నావే!!
చరణం:
2
కడవ నువ్వు నడుమున బెట్టి
కట్టమీద నడిసొత్త ఉంటే
సంద్రం నీ సంకెక్కినట్టు
ఎంత సక్కగున్నావే..
లచ్చిమి,
ఎంత సక్కగున్నావే!!
కట్టెల మోపు తలకెత్తుకోని
అడుగులోన
అడుగేత్తావుంటే
అడవినీకు
గొడుగట్టినట్టు
ఎంత సక్కగున్నావే..
లచ్చిమి,
ఎంత సక్కగున్నావే!!
బురదసేలో
వరినాటు ఏత్తావుంటే.. ఎంత సక్కగున్నావే
బూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంతసక్కగున్నావే..
యేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగ తగిలిన లంకె బిందెలాగ
ఎంత సక్కగున్నావే.. లచ్చిమి,
ఎంత సక్కగున్నావే
సింతసెట్టు
ఎక్కి సిగురు కొయ్యబోతె..
చేతికి అందిన సందమామలాగ
ఎంత
సక్కగున్నావే.. లచ్చిమి, ఎంత సక్కగున్నావే.
No comments:
Post a Comment