జరిగిందొక్క వింతవేట.. పులిపై పడిన లేడి కథ వింటారా?
జాబిలిరాని రాతిరంతా.. జాలే లేని పిల్ల వెంట
అలికిడి లేని అల్లరంతా.. గుండెల్లోకి దూరి అది చూస్తారా?
చుట్టూ ఎవ్వరూ లేరూ.. సాయం ఎవ్వరూ రారూ..
చుట్టూ ఎవ్వరూ లేరూ.. సాయం ఎవ్వరూ రారూ..
నాపై నేనే ప్రకటిస్తున్నా.. ఇదేమి పోరూ..
అనగనగనగా.. అరవిందట తన పేరూ..
అందానికి సొంతూరూ.. అందుకనే ఆ పొగరూ..
అరెరరెరరెరే.. అటు చూస్తే కుర్రాళ్లూ..
అసలేమైపోతారూ.. అన్యాయం కదా ఇది అనరే ఎవ్వరూ..
చరణం:
ప్రతినిమిషమూ తన వెంట.. పడుగాపులే పడుతుంటా..
ఒకసారి కూడ చూడకుందె క్రీగంటా..
ఏమున్నదో తన చెంత.. ఇంకెవరికీ లేదంతా..
అయస్కాంతమల్లె లాగుతుంది నన్నూ..
చూస్తూనే ఆ కాంతా తను ఎంత చేరువనున్నా..
అద్దంలో ఉండె ప్రతిబింబం అందునా..
అంతా మాయలా ఉంది.. అయినా హాయిగా ఉంది
భ్రమలా ఉన్నా బానే ఉందే.. ఇదేమి తీరు!!
మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా..
మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా?
మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా..
మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా?
అనగనగనగా.. అరవిందట తన పేరూ..
అందానికి సొంతూరూ.. అందుకనే ఆ పొగరూ..
అరెరరెరరెరే.. అటు చూస్తే కుర్రాళ్లూ..
అసలేమైపోతారూ.. అన్యాయం కదా ఇది అనరే ఎవ్వరూ..
మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా..
మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా?
మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా..
మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా?
అనగనగనగా.. పులిపై పడిన లేడి కథ వింటారా?
No comments:
Post a Comment