Niddarani Irisesi Reppalni Terisnu Song Lyrics In Telugu | Aravinda Sametha Song Lyrics In Telugu | Telugu Songs Lyrics In Telugu - Telugu lyrics

Wednesday, August 12, 2020

Niddarani Irisesi Reppalni Terisnu Song Lyrics In Telugu | Aravinda Sametha Song Lyrics In Telugu | Telugu Songs Lyrics In Telugu


 నిద్దరని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సుపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా 

నలిగేటి నామనసు గుర్తొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసిన రారా
పెనిమిటీ ఎన్ని నాల్లోయినదో నిను చూసి కల్లారా
ఎన్నెన్నిన్నాళ్ళయినదో నిను చూ సి కల్లారా

చిమ్మాటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి వెచ్చగా దుప్పటి
కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతు చేసి పాడతాంది రా రా పెనిమిటి
గుండెనే గొంతు చేసి పాడతాంది రా రా పెనిమిటి

పొలిమేర దాటి పోయావని
పొలమారిపోయే నీ దానిని
కొడవలి లాంటి నిన్ను సంటి వాడిని
కొంగున దాసుకునే ఆలీ మనసుని
సుసి సూడక సులకన సెయకు
నా తల రాతలో కలతలు రాయాకు
తాళిబొట్టు తలుసుకొని తరలి తరలి రా రా పెనిమిటి
హే తాళిబొట్టు తలుసుకొని తరలి తరలి రా రా పెనిమిటి

నరగోస తాకే కామందువే 
నరగోస తాకే కామందువే
నలపుసవైన  కంటికందవే
కటికి ఎండలలో కందిపోతివో
రగతపు సింధులతో తడిసిపోతివో
యేలకు తింటివో యెట్టనువ్వుంటివో
యేట కట్టి తలగడయి యెడ పండుకుంటివో
నువ్వు గన్న నలుసునైనా తలసి తలసి రారా పెనిమిటి
హే నువ్వు గన్న నలుసునైనా తలసి తలసి రారా పెనిమిటి 

నిద్దరని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సుపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
పెనిమిటీ ఎన్ని నాల్లోయినదో నిను చూసి కల్లారా
ఎన్నెన్నిన్నాళ్ళయినదో నిను చూ సి కల్లారా

No comments:

Post a Comment