సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడూ..
బుడ్డోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే
బుడ్డోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే
చేతిలో ఒడిసి దాని కొమ్ములతో కోలాటం ఆడే
ఈ సిత్తరాలా సిరపడు
యాడవిక్కె మర్రి చెట్టు దయ్యల కొంపైతే
యాడవిక్కె మర్రి చెట్టు దయ్యల కొంపైతే
దయ్యముతొ కయ్యానికి తొడగొట్టీ దిగాడు
దయ్యముతొ కయ్యనికి తొడగొట్టీ దిగాడు
అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు
అమ్మోరి జాతరలో ఒంటి తలా రావణుడు
గుంటలెంట పడితేనూ గుక్కి గుండ చేసినాడు
గుంతలెంట పడితేనూ గుక్కి గుండ చేసినాడు
వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటే
వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటే
ఈ ఈడీదుకుంటుబోయి ఈడ్చుకొచ్చినాడురో
ఈ ఈడీదుకుంటుబోయి ఈడ్చుకొచ్చినాడురో
పదిమంది లాగలేని పనిమోల సొరసేపా
పదిమంది లాగలేని పనిమోల సొరసేపా
ఒదుపుగా ఒంగి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు రో
ఒదుపుగా ఒంగి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు రో
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు
గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు
గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్లనిరగదంతె
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే
No comments:
Post a Comment