చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పట్టాసే
ఫట్టుమని పేలింద నా గుండె ఖల్లాసే
అట్ట నువ్వు గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే
వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే
చిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైట్ ఏసావే
హతేరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావే
బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలోన రంగులు పుసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే
యుద్ధమేమీ జరగలే సుమోలేవి అసలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండ చూపించినవే
మేడం ఎలిజిబెత్ నీ రేంజ్ అయినా
తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా...
మాసుగాడి మనసుకే ఓటేసావే
బంగ్లా నుండి బస్తీకి ఫ్లయిటేసావె
తీన్మార్ చిన్నోడిని డీజే స్టెప్పులు ఆడిస్తివే
నసీబ్ బ్యాడ్ ఉన్నోడిని నవాబు చేసేస్తివే
అతిలోక సుందరివి నువ్ ఆఫ్ట్రాల్ ఓ టపోరి నేను
గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకు చేరిస్తివే
అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చి బజ్జి లాంటి లైఫులో నువ్వు ఆనియన్ ఏసావే
అరెరే గిచ్చాసావే లవ్వు ట్యాటూ గుచ్చేసావే
మస్తూమస్తు బిరియానీలో నింబు చెక్కయ్ హల్చల్ చేసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే
Song Details:
Movie: Jathi Ratnalu
Song: Chitti
Lyrics: Ramajogayya Sastry
Music: Radhan
Singer: Ram Miryala
Music Label: Lahari Music.